
తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూ రు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని అంశా లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము సిబిఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కోర్టు ఈ సంద ర్భంగా గుర్తు చేసిం ది. ఏదైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే నేరుగా సిబిఐ అధికారులకే తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది. గతంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై సిబిఐ ఎటువంటి విచారణ జరపలేదని పిటిషనర్ పేర్కొనగా దర్యాప్తు సంస్థ తన పని తాను చేస్తోం దని ధర్మాసనం అభిప్రా యపడింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించాయి. ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఇప్పటికే ఈ లడ్డూ వివాదంపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యా ప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని సిజెఐ ధర్మాసనం వెల్లడించింది. సిట్ విచారణ నివేదిక అంశాల పరిశీలన తరువాత తదుపరి నిర్ణయాలు ఉంటాయని కోర్టు తెలిపింది. ఈ విషయంపై ఎపి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి సిట్ నివేదికతో పాటు లడ్డూ వివాదంపై ప్రభుత్వా నికి సమగ్ర నివేదిక అందిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి పిటిషన్లను విచారించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.