
దుబాయ్‌పై ఇరాన్ భీకర దాడులు
గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసం
దుబాయ్ ఇంటర్నేషనల్ సెంటర్‌పై దాడి
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకరం అయింది. గల్ఫ్‌లో ఇరాన్ తీవ్రదాడుల సమయంలోనే శుక్రవారం టెహరాన్‌లోని టెహరాన్ స్కేర్‌లో బారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇక్కడ దాడులకు దిగినట్లు వెల్లడైంది. టెహరాన్ యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న టెహరాన్ ఫిరదౌసి స్వేర్ వద్ద వరుసగా భీకర పేలుళ్లు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు,ప్రత్యేకించి చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. వార్షిక క్వాడ్స్ దినం సందర్భంగా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపే ప్రదర్శన దశలోనే జనం పెద్ద ఎత్తున గుమికూడారు.
పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం వస్తూనే ఉన్నారని వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చావు తప్పదని నినదించారు. పేలుళ్లు దాడుల ఈ ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని వెల్లడైంది. అయితే ఎందరు చనిపోయి ఉంటారు? ఎందరికి గాయాలు అయ్యాయి ? తరువాతి పరిస్థితి ఏమిటనేది వెంటనే నిర్థారణ కాలేదు. తమ పతీకార దాడులు తీవ్రతరం అని చెప్పిన ఇరాన్ అత్యంత వ్మూహాత్మకంగా పలు ప్రాంతాల్లో జరిపిన దాడులు పలు కీలక అనంతర పరిణామాలకు దారితీశాయి టెహరాన్ , మరో నగరం ఖజ్విన్‌లోనూ దాడులు తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ముందుగానే ప్రకటించారు. ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీస్తామని వేర్వేరుగా ట్రంప్ , నెతన్యాహు హెచ్చరించారు. అయితే ఈ క్రమంలోనే ఇరాన్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, అక్కడి ఎయిర్‌పోర్టులను.
చమురు క్షేత్రాలను లక్షంగా ఎంచుకుని దాడులు ఉధృతం చేసింది. ఇరాన్ సుప్రీంనేత మొజ్తబా ఖమేనీ హెచ్చరికల తరువాత ఇరాన్ శుక్రవారం ఉదయం గల్ఫ్‌లోని అరబ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. సౌదీ అరేబియాలో పలు ప్రాంతాల్లో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దుబాయ్‌లోని పలు భవనాలపై ఇరాన్ దాడులు జరిగాయి. మరో సారి బుర్జ్ ఖలీఫా వద్ద కూడా డ్రోన్లు పడ్డాయి. అయితే ఇవన్ని చిన్న ఘటనలే అని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో తమ దాడుల ఉధృతి అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసానికి ఇరాన్ ప్రయోగించిన దాదాపు 50 డ్రోన్లను సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి. ఒమన్‌లోడ్రోన్ల దాడులలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అక్కడి సోహర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ల దాడితో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక్కడ నేలకూలినడ్రోన్ల శకలాలు ధాటికి ప్రజలు గాయపడ్డారు.
బహరైన్‌లో భారీ స్థాయిలో సైరన్లు మోగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫెనాన్సియల్ సెంటర్‌లోని అమెరికా స్థావరాలను ఎంచుకుని ఇరాన్ దాడులు జరిగాయి. ఈ ప్రాంతాన్ని అత్యంత కీలకమైన డిఐఎప్‌సి జోన్‌గా వ్యవహరిస్తారు. ఇక్కడ బ్యాంకులు, వాణిజ్య కేంద్రాలు, షేర్ల వ్యాపార కార్యాలయాలు ఎక్కువగా ఉంటాయి. రెస్టారెంట్లు, సంపన్నుల నైట్‌క్లబ్‌లతో సందడిగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడి దాడులతో కలవరం చెలరేగింది. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సైన్యానికి చెందిన కెసి 135 రిఫ్యూయలింగ్‌విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికా సిబ్బంది మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది. ఇరాక్ సేనలుపొరపాటున ఈ నౌకను దెబ్బతీశాయా? లేక ఇరాన్ దాడులు సాగించిందా? అనేది నిర్థారణ కాలేదు. తాము ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
శత్రువు లేదా పొరపాటు దాడులు జరిగి ఉంటాయని తాము అనుకోవడం లేదని, ఇది ప్రమాదం అయి ఉంటుందని తెలిపారు. ఇరాన్‌పై శుక్రవారం దాడులను తీవ్రతరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహరాన్‌తో పాటు 200కు పైగా చోట్ల ఇరాన్ వైమానిక దాడులు సాగాయి. ఇక ఒమన్‌లో శుక్రవారం ఓ డ్రోన్ కూలిన ఘటనలో ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. వీరి గుర్తింపు తెలియలేదు. ఇరాన్ జరిపిన దాడులలో అమెరికాకు చెందిన విమానవాహక నౌక అబ్రహాం లింకన్ గల్ఫ్ జలాల్లో ధ్వంసం అయింది. పనిచేయకుండా పోయిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ తెలిపాయి. అయితే ఈ వాదనను అమెరికా ఖండించింది. తమ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఈ ఈ నౌకను దెబ్బతీశామని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దీనిని యుఎస్ సైన్యం కొట్టిపారేసింది.
హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకల కదలికలు
భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఉద్రిక్తతల జలాల్లో ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. వీటిలో అంతా కలిపి 700 మంది వరకూ భారతీయ నావికులు ఉన్నారని నిర్థారించారు. ఈ నౌకలను కూడా ఇక్కడి జల మార్గం ద్వారా వెలుపలికి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటివరకూ హర్మూజ్ ప్రాంతంతో జరిగిన దాడులలో ముగ్గురు భారతీయ నావికుల మృతి చెందారు, ఒకరు గల్లంతు అయ్యారు.