
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా.. మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే మోజ్తబా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారం తీర్పుకుంటామని ఆయన అన్నారు. అయితే తాజాగా జరిగిన ఓ దాడిలో మోజ్తబా తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన కాలు కూడా తీసేశారని.. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని తెలియవస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ గాయపడ్డారని.. గుర్తుపట్టలేనంతగా మారిపోయారని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.