Reading Time: < 1 minute

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్‌ సినిమాపై ఎంతో క్రేజ్‌ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. ఎపిలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది.

మార్చి 19న తెల్లవారుజామున 4-5 గంటల మధ్య బెనిఫిట్‌ షోకి అనుమతి ఇవ్వగా.. దీని టికెట్ ధరను రూ.500 (ట్యాక్సులు కలిపి)గా నిర్ణయించారు. అలాగే పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.125 పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఇక మూవీ రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా నిర్ణయించారు.