
రాష్ట్రంలో 810 ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్ల్లీంచడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు
పాల్పడనందుకు ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకమారు ఎల్‌పిజి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.