
‘ది హండ్రెడ్ లీగ్’ కోసం నిర్వహించిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ సిఇవొ కావ్యా మారన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని పాక్ ఆటగాడిని కొనుగోలు చేసింది. సన్ గ్రూప్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థానీ ఆటగాడిని కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎక్స్‌లో కూడా సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు అధికారిక ఖాతాను తొలగించారు. తాజాగా ఈ విషయంపై బిసిసిఐ స్పందించింది. ఆ వేలంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
‘‘ఆ కొనుగోలు వ్యవహారంలో ఐపిఎల్‌లో జరగలేదు. సన్‌రైజర్స్ యాజమాన్యం విదేశీ లీగ్ వేలం బిడ్డింగ్‌లో పాల్గొని పాక్ క్రికెటర్‌ని తీసుకుంది. అది వారి నిర్ణయం. అందులో మేం చేసేదేమీ లేదు. వేరే లీగుల్లో ఏం జరిగినా మాకు సంబంధం లేదు. భారత్ వెలుపల ఆయా ఫ్రాంచైజీల బిడ్డింగ్‌ల్లో మాకు ఏం సంబంధం ఉంటుంది?’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.