
ఐపిఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం ఎప్పటి నుంచో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సొంతంగా ఓ లీగ్ ఏర్పాటు చేసుకొని.. ఐపిఎల్‌తో పోటీ పడాలని నానా కష్టాలు పడుతోంది. అయితే తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడిని కొనుగోలు చేయడంతో సన్‌రైజర్స్ చిక్కుల్లో పడింది. అయితే సన్‌రైజర్స్ లీడ్స్ పాక్ ప్లేయర్ అబ్రామ్ అహ్మద్‌ని రూ.2.34 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో సన్‌పైజర్స్ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వేలంలో సన్‌రైజర్స్ సిఇలో కావ్య మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్ లీడ్స్ ఎక్స్ ఖాతా సస్పెన్సన్‌కు గురి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనికి గల కారణాల గురించి ఎక్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. యూజర్లు ఆ ఖాతాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. ‘అకౌంట్ సస్పెండెడ్’, ‘ఎక్స్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వాయిలేట్ ది ఎక్స్ రూల్స్’ అనే పాప్ ఆప్ మెసేజ్ వస్తుంది.