Reading Time: < 1 minute

బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో దేశభక్తి సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన దేశభక్తి చిత్రమే ‘బార్డర్-2’. 1997లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘బోర్డర్‌’కి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమాలో వరుణ్ ధవన్, దిల్జీత్ దొసాంజ్ తదితరుు కీలకపాత్రలు పోషించారు. 1971 ఇండో-పాక్ వార్‌లో ఏం జరిగింది.. భారత సైన్యం వీరోచిత పోరాటం ఈ సినిమాలో చూపించారు.

రూ.275 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.485 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. కాగా, థియేటర్లలో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతుంది. మార్చి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.