Reading Time: < 1 minute

ఛత్తీస్ గఢ్: తాము లొంగిపోలేదు.. ముందు నుంచీ జన జీవన స్రవంతిలోనే ఉన్నామని మావోయిస్ట్ మాజీ చీఫ్ దేవ్ జీ తెలిపారు. ఆపరేషన్ కగార్ తమకు చిన్న విషయం అని అన్నారు. దేవ్ జీ మీడియాతో మాట్లాడారు. వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని, సోనూ పోలీసులకు ఆయుధాలతో సరెండర్ అయ్యారని, తాను సరెండర్ కాను అని పోలీసులకు చెప్పానని అన్నారు. పోలీసులు మమ్మల్ని ఇంటరాగేషన్ చేశారని, చంపాలని అనుకోవడం లేదని.. సరెండర్ కావాలని పోలీసులు సూచించారని అన్నారు.  మావోయిస్టు పార్టీని విస్తరించడంలో తాము విఫలమయ్యామని, మావోయిస్టులు పార్టీ నిర్వీర్యం కావడానికి తప్పుడు నిర్ణయాలే కారణం అని తెలియజేశారు. మావోయిజాన్ని వదిలేస్తే సరెండర్ అంటారా? అని దేవ్ జీ ప్రశ్నించారు. పార్టీపై నిషేధం ఎత్తివేయాలని సిఎం రేవంత్ రెడ్డిని కోరామని, ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ పోరాటం చేయాలనుకుంటున్నామని, ముందు లొంగిపొమ్మన్నారని..ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అంటున్నారని, మావోయిస్టులను ఏ పేరుతో పిలిచినా.. జైల్లో ఉన్నవారిని విడుదల చేయాలని కోరామని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ తో కొందరిలో ప్రాణభయం ఏర్పడిందని,

మావోయిస్టు చీఫ్ గణపతి లోపల ఉన్నాడా.. బయట ఉన్నాడా ఆయనే చెప్పాలని, శత్రువులతో చేతులు కలిపి ఆయుధాలు అప్పగించాడు కాబట్టే కోవర్టు అంటున్నాం అన్నారు. గణపతికి సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదని, గణపతికి రక్షణ కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. చావుకైనా సిద్ధపడే మావోయిస్టు పార్టీలో చేరామని, ఆయుధాలతోనే లొంగిపోవాలనే విధానం పార్టీకి చాలా నష్టం చేసిందని చెప్పారు. గణ పతిని లొంగిపోవాలని లేదా రమ్మని చెప్పే అవకాశం తమకు లేదని, నిషేధం ఎత్తివేస్తే మావోయిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. నిషేధం ఎత్తివేసే అంశం కేంద్రం పరిధిలో ఉందని, కేంద్రంతో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ప్రభుత్వం నిర్ణయం కోసమే తాము ఎదురు చూస్తున్నామని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం లీగల్ ఫ్రేమ్ లో పని చేయాలనుకుంటున్నామని, జైలులో ఉన్నవారిని విడిచి పెట్టాలని సిఎం ను కోరామని దేవ్ జీ స్పష్టం చేశారు.