Reading Time: < 1 minute

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ అని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఇప్పటివరకు చదివిన పాఠాలను పునరావృతం చేసుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలరని సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2676 సెంటర్లలో 5,28,239 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు చేరుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలు రాయనున్న ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.