Reading Time: < 1 minute

ఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని పిటిషన్ వేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని ఎవరూ మాట్లాడకుండా స్టే విధించాలని మానురూ శ్రీనివాస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారం సిబిఐ దర్యాప్తు చేస్తోందని, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని శ్రీనివాస్‌ను సిజెఐ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఏమైనా ఆధారాలు ంటే సిబిఐ అధికారులకు అందించాలని అతడికి కోర్టు సలహా ఇచ్చింది. సిబిఐ విచారణ జరుగుతుండగా తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది.