
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని మేనిఫెస్టోలో చెప్పారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామన్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నిస్తూ హరీష్ రావు లేఖ రాశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతబట్టి దేశవ్యాప్తంగా నీతిసూత్రాలు చెప్తారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షించడమంటే ఇదేనా? అని..దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా? అని ప్రశ్నించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవకాశవాదం కోసం వాడుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు.