Reading Time: < 1 minute

ఆది, మేఘ, హనిక హీరో హీరోయిన్లుగా నటిస్తు న్న సినిమా బుల్లెట్ రెడ్డి. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి ఫిలింస్ బ్యానర్ పై ఆది దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్ర విశేషాలను హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత హీరో ఆది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ ఖయ్యూం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత హీరో ఆది మాట్లాడుతూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఈ చిత్రం లో హీరో బుల్లెట్ రెడ్డి వెయ్యి ఎకరాల జమీందారు. ఆయనకు చెందాల్సిన లక్షల కోట్ల రూపాయల విలువైన నిధి దక్కించుకునేందుకు కొం దరు దురాశ పరులు ఎలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉం టుంది. మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌లో ఉంది. ఆదిలాబాద్ అడవుల్లో పాట చిత్రీకరణ జరిపాం. అలాగే నిజామాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ లు రూపొందించాం. ఈ నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాం తాల్లో తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఏప్రిల్ 5వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఆ తర్వాత గోవాలో జరిపే షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ జరిపి, చివరి షెడ్యూల్ మళ్లీ ఆదిలాబాద్, నిజామాబాద్ లో చేస్తాం. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 16న మా మూవీని రిలీజ్ చేస్తాం”అని అన్నారు.