Reading Time: < 1 minute

బాగ్దాద్: పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తీవ్రంగా వైమానికి దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను ఇరాన్ తిప్పుకొడుతుంది. ఈ దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాక్ భూభాగంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానం కూలిపోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన కెసి-135 స్ట్రాటో ట్యాంకర్ రిఫ్యూయలింగ్ అనే విమానం ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు చనిపోయారని ఇరాన్ మీడియా తెలియజేసింది. అమెరికా విమానాన్ని తామే కూల్చివేశామని సోషల్ మీడియాలో ఇరాన్ అనుకూల వర్గం ప్రచారం చేసుకుంటుంది. విమానం కూలిన ఘటన నిజమేనని, శత్రువుల దాడిలో మాత్రం కూలిపోలేదని, రెండు విమానాలు ఒకదానితో ఒకటి తగలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అమెరికా తెలిపింది. ఇరాన్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ ఫ్యూరీలో భాగంగా ఈ విమానం విధులు నిర్వహిస్తోందని అమెరికా రక్షణ శాఖ వివరించింది. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొంది. పశ్చియాసియాలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం కావడం గమనార్హం. హార్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్ వంటి దేశాలలో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది.