Reading Time: < 1 minute

యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్‌లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ సెట్ లో షూట్ ర్యాప్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సమావేశంలో హీరో అడివి శేష్ మాట్లాడుతూ “డెకాయిట్ ఒక కొత్త జోనర్ లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్ లో చెప్పిన లవ్ స్టోరీ. సినిమా చివరకు వచ్చేసరికి అందరూ ఎమోషన్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీస్‌తో కలిసి చూడొచ్చు”అని అన్నారు. ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ “డైరెక్టర్‌కి ఇది ఫస్ట్ ఫిలిం, అనురాగ్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా. శేష్ చేస్తున్న ఫస్ట్ లవ్ స్టోరీ ఇది”అని తెలిపారు. డైరెక్టర్ షానియల్ డియో మాట్లాడుతూ “భీమ్స్ తన మ్యూజిక్‌తో సినిమాను నేను నెక్స్ లెవెల్ తీసుకెళ్లారు. అనురాగ్‌తో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సుప్రియకి, శేష్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ ఒక మంచి అనుభూతినిస్తుంది”అని తెలియజేశారు. ఈ సమావేశంలో అనురాగ్ కశ్యప్, భీమ్స్, విజయ్, నాగేంద్ర పాల్గొన్నారు.