
రంగారెడ్డి: కారు చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతంలో జరిగింది. చటాన్ పల్లిలోని సురసముద్రం చెరువులోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కారును చెరువులో నుంచి బయటకు తీశారు. కారులో ఎవరు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో నుంచి చెరువులో పడిపోయారా? లేకపోతే కావాలని కారులో చెరువులోకి తోసేసారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాద్‌నగర్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.