Reading Time: < 1 minute

అమరావతి: శ్రీశైలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్‌గేట్ వద్ద భక్తులపైకి వాహనం దూసుకెళ్లడంతో పది మంది గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వాహన డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ అజాగ్రత కూడా ఉండి ఉంటుందని తెలుస్తోంది.