
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ (టిజిఎఫ్‌ఎ) వేడుకల్లో భాగంగా, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టిజిఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక గురువారం మెగాస్టార్ డా.చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు’ ను స్వీకరించాల్సిందిగా వారు చిరంజీవిని సాదరంగా ఆహ్వానించారు. మార్చి 19న హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరగనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఈ గౌరవాన్ని అందుకోవాలని వారు కోరారు.