Reading Time: < 1 minute

రెండో వివాహం చేసుకోవడానికి భార్య ఒప్పుకోలేదని భర్త దారుణంగా కొట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీ వేమవరంలో చోటు చేసుకుంది.ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. మణికంఠ, దేవి2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు.దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.. మేనకోడలును రెండో పెళ్లి చేసుకోవాలని మణికంఠ నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా.. దేవిని రోడ్డు మీద కిందపడేసి కొట్టాడు మణికంఠ. ఈ ఘటనను స్థానికులు సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటనపై దేవి తనకు న్యాయం చేయాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారిలో ఉన్న నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు.