Reading Time: < 1 minute

జాబ్ కన్సల్టెన్సీ యజమాని హత్య చేసిన నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. కత్తితో పాటు ఐఫోన్-15, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్‌స్పెక్టర్ ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. తేదీ 10-03-2026 సాయంత్రం సుమారు 17:30 గంటలకు, హైదరాబాద్‌లోని ఇంజనీర్స్ కాలనీలోని బెస్ట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ జాబ్ కన్సల్టెన్సీ జగ్గవరపు శశికిరణ్ రెడ్డి నిర్వహిస్తున్నాడు. ఇందులో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న దులిపాడు అక్షయ అలియాస్ సాయి శృతి పనిచేస్తోంది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఎపిలోని విశాఖపట్నం జిల్లా, మునగపాక మండలం, గణపర్తి గ్రామానికి చెందిన సుమారుపొల్లమారి శెట్టి ప్రభు కుమార్ అలియాస్ షాను(19) ప్రైవేట్ ఉద్యోగి. ఉద్యోగం కోసం కొంత కాలం క్రితం కన్సల్టెన్సీలో ఉద్యోగం కావాలని సంప్రదించాడు, రూ.2,500 చెల్లించాడు. ఓ హోటల్‌లో ఉద్యోగంలో చేరిన ప్రభు కుమార్ ఉద్యోగం నచ్చకపోవడంతో రెండు రోజులకే మానివేశాడు. తర్వాత కన్సల్టెన్సీ కార్యాలయానికి వచ్చిన నిందితుడు కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించిన ఉద్యోగం నచ్చలేదని, తాను చెల్లించిన డబ్బును , పని చేసిన రోజుల జీతాన్ని తిరిగి ఇవ్వాలని గొడవపడ్డాడు.

అక్షయ నిందితుడిని కౌన్సెలింగ్ గదిలో కూర్చోబెట్టి, యజమాని జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి కి సమాచారం ఇచ్చింది. తర్వాత శశికిరణ్ గదిలోకి వెళ్లిన ప్రభు కుమార్ ఆయనతో గొడవపడ్డాడు. గది నుండి పెద్దగా అరుపులు రావడంతో అక్షయ శశికిరణ్ గదిలోకి వెళ్లగా కత్తితో బయటికి వచ్చిన నిందితుడు అక్షయ ఎడమ భుజంపై పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడు వెళ్లిన తర్వాత సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా, జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. అతడి శరీరంపై సుమారు 23 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై 103(1), 109, 329(4), 127(2), 351(2), 305 బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ హెచ్. ప్రభాకర్, డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ , సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.