Reading Time: < 1 minute

 ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో అయతుల్లా ఖమేనీ భార్య మన్సోరేష్ ఖోజసెహ్ మరణించలేదు. ఆమె సజీవంగానే ఉన్నారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా గురువారం అధికారికంగా తెలిపింది. గత నెల 27 రాత్రి జరిపిన దాడిలో అక్కడికక్కడే ఖమేనీ హతులయ్యారని, ఆయన భార్య మరుసటి రోజు చికిత్స దశలో చనిపోయారని ఇంతకు ముందు వార్తలు వెలువడ్డాయి. ఇవి నిజం కావని ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఆమె ఓ రహస్య ప్రాంతంలో క్షేమంగా, ఆరోగ్యంగా, భద్రంగా ఉన్నారని వివరించారు. కాగా ఇరాన్ నూతన నేత మొజ్తాబా ఖమేనీ అధికార పగ్గాల తరువాత తమ తొలి ప్రసంగంలో ఎక్కువగా తండ్రి ఖమేనీ గురించి ప్రస్తావించారు. సీనియర్ ఖమేనీ వీరోచిత పోరు తనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం అన్నారు. అయితే తల్లి గురించి మాట్లాడలేదు.