Reading Time: < 1 minute

సూర్యాపేట: రాష్ట్రంలో ఏర్పడిన గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సూర్యాపేటలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని తెలిపారు. కమర్షియల్ గ్యాస్‌కు మాత్రమే కొంత సరఫరా ఆగిందని అన్నారు. గ్యాస్ కొరతపై శుక్రవారం ఆయిల్ కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సిఎస్, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. జన జీవనానికి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని.. ఎల్‌పిజి విషయంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.