Reading Time: < 1 minute

ప్రజలకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును మరోసారి పెంచింది. ఇప్పటికే పట్టణాల్లో సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచగా, తాజాగా, గ్రామాల్లోనూ కొత్తగా నిబంధనలు విధించారు. గ్రామాల్లో కూడా సిలిండర్‌కు, సిలిండర్‌కు మధ్య కనీస గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. ఈ కొత్త నిబంధన వల్ల అక్రమ నిల్వలను అరికట్టేందుకు, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.