
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్ ) సమ్మిట్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్ జూలై 25న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది సమ్మిట్ థీమ్ చేంజ్ టు లెగసి గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమాజంపై సానుకూల ప్రభావం చూపే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమ్మిట్ నిర్వాహకులను అభినందించారు. ఈ సమ్మిట్ ద్వారా కార్పొరేట్ సంస్థలు, ఎన్‌జీఓలు, సోషల్ ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు ఒకే వేదికపైకి వచ్చి సామాజిక అభివృద్ధికి కలిసి పనిచేసే అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వినిల్ రెడ్డి ఎదుడొడ్ల (లైసెన్సీ), వంశీ ముత్యపు (మేనేజింగ్ డైరెక్టర్), ఆదిత్య వేదాంతం (డైరెక్టర్), సుమంత్ వల్లాల (డైరెక్టర్)పాల్గొన్నారు. సమ్మిట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.