
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పోలీస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింద్’. ‘గబ్బర్‌సింగ్’ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇద కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్‌డేట్స్ అన్ని అభిమానులను వివరీంతంగా నచ్చేశాయి. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘కాలరే ఎత్తర’ అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. తాజా ఫుల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాటకి దేవిశ్రీ ప్రదసాద్ సంగీతం అందించగా.. రామ్ మిర్యాల పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇఖ శ్రీలీల హీరోయిగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.