
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్యజరుగుతున్న యుద్దాల ప్రభావం ఎల్‌పిజి,ఎన్‌జిల పై పడటంతో ఆటో డ్రైవర్ల్లు ఇబ్బందుల పాలువుతున్నారని ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 1 వరకు ఎల్‌పిజి లీటర్‌కు రూ. 63 ఉండగా ప్రస్తుతం .100 చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా ఫ్రీ బస్సు ద్వారా కూడా తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్‌పిజి, సీఎన్‌జి ధరలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసిందని పేర్కొంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ ఒక ప్రటనలో విజ్ఞప్తి చేసింది.