Reading Time: < 1 minute

అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్ని సంక్షేమ పథకాలకు స్వస్థి పలికిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కెసిఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని గుర్తు చేశారు. మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ రంజాన్ తోఫా ప్రతి ముస్లింలకు అందజేస్తామని తెలిపారు. రంజాన్ సందర్భంగా సోమాజిగూడలో మాజీ ఎంఎల్‌సి సలీం ఆధ్వర్యంలో గురువారం రేషన్ కిట్‌ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కెటిఆర్ పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్‌లను అందజేశారు. కెసిఆర్ హయాంలో ప్రతి పేద ముస్లిం అమ్మాయి పెళ్లి అయితే షాది ముబారక్ పథకంతో లక్షా నూట పదహారు ఇచ్చామని అన్నారు.

కేవలం పేదల ఇండ్లపై బుల్డోజర్ పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పకుండా మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎంఎల్‌ఎ దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలకు మోసం చేసి పార్టీ ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లా దయతో అందురు రంజాన్ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ కెటిఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.