Reading Time: < 1 minute

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గతంలో పోలీసులు సీజ్ చేసిన దాదాపు 50 బైకులు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయి. చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు.