Reading Time: < 1 minute

గతేడాది చివర్లో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై.. సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా 2025 డిసెంబర్-5న విడుదలై.. దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మార్చి-19న ఈ సినిమా సీక్వెల్ ‘దురంధర్: ది రివేంజ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ధురంధర్’ని థియేటర్లలో మిస్ అయిన వాళ్ల కోసం మరోసారి రీ-రిలీజ్ చేస్తున్నారు.

గురువారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం పెద్దగా సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒటిటిలో విడుదలైన ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో ‘ధురంధర్’ని విడుదల చేస్తున్నారు. భారత్‌లోనే ఏకంగా 250 థియేటర్లలో తీసుకురావడంతో పాటు నార్త్ అమెరికాలో 185 సినిమాస్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకూ అటు థియేటర్‌లో ఇటు ఒటిటిలో చూడలేని వారికి ఇదొక సరికొత్త అనుభూతి అనే చెప్పుకోవాలి.