
హైదరాబాద్: కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ.. మాజీ సిఎం కెసిఆర్, హరీశ్‌రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కె జోషి పిటిషన్లు దాఖలు చేశారు. కెసిఆర్, హరీశ్‌రావు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటికే ప్రభుత్వం, కమిషన్ తరఫున వాదనలు పూర్తయ్యాయి. కెసిఆర్, హరీశ్‌రావును ఇబ్బంది పెట్టేందుకే కమిషన్ వేశారని న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగా వీరిద్దరిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరిపైనా ఇప్పటికే దుష్ప్రచారం చేశారని తెలిపారు.