Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను సమాయానికి ఇవ్వడం లేదని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. యాసంగి పంట రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డికు రామచందర్ రావు బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసాను రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, రైతు భరోసాను పెంచకుండానే రూ.12 వేలకే పరిమితం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల నీళ్లు కాల్వలకు రాక పంటలు ఎండిపోతున్నాయని, అప్పులతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో విద్యార్థులకు ఇబ్బంది తప్పట్లేదని, ప్రభుత్వ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత మాజీ సిఎం కెసిఆర్ ప్రజల సమస్యలపై మాట్లాడే బాధ్యతను విస్మరించారని రామచందర్ రావు పేర్కొన్నారు.