
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్చుతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై ఇద్దరు యువకులు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఇద్దరు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మరిపెడ మండలం గాలివారి గూడెం వాసులు ఉదయ్, భిక్షంగా పోలీసులు గుర్తించారు.