
‘కల్కి’, ‘శుభం’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ ‘దీవాన’. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే తెలంగాణ అర్బన్ నేపథ్యంలో మరో స్వచ్చమైన ప్రేమ కథా చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. యూత్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ ను వదిలారు. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.