
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి సిబిఐ అధికారులు వచ్చారు. మద్యం కుంభకోణంలో హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు సిబిఐ అధికారులు కవిత ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ అభియోగాలు నిరాధారమని రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కవితకు సమన్లు ఇచ్చేందుకు ఆమె నివాసానికి సిబిఐ అధికారులు వచ్చారని సమాచారం. కాగా, ఈ కేసులో కవితను ఈడి అరెస్ట్ చేయడంతో దాదాపు నాలుగైదు నెలలపాటు ఆమె తిహార్ జైలులో ఉన్నారు.