Reading Time: < 1 minute

నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్…’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఆయా షేర్ పాట రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ అందరికీ నచ్చింది. అనిరుధ్ నేను ఇచ్చిన పదాలు తీసుకొని జనాలకి నచ్చే విధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు.

ఇంత ఫిరోషియస్ సాంగ్ లో లిరిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడం, హిట్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల్ వెనుక మంచి కథ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆ జడలు గురించి మాట్లాడుకుంటున్నారు. అనిరుద్ పాట చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొడుతున్నాం అని చెప్పారు. ఈ పాట సక్సెస్‌కి ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్. జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తిని ఇచ్చే క్రమంలో వచ్చిన పాట ఇది. డైరెక్టర్ శ్రీకాంత్‌తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఇక చిరంజీవి విశ్వంభరలో నా పాట ఉంది. పవన్ కళ్యాణ్‌కి ఉస్తాద్‌లో రాశాను”అని అన్నారు.