Reading Time: < 1 minute

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో హోటల్స్ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ ఆలయాల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.

తాజాగా అయోధ్య రామ మందిరంలో కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. బాలరాముడి దర్శనానికి రోజూ వేలా సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తుంటారు. దీంతో దాదాపు రోజూ 20 వేల మంది భక్తుల వరకు అక్కడ భోజన ప్రసాదం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ సంక్షోభం కారణంగా భోజన ప్రసాదం ఏర్పాటు చేసే రామ్ రసోయిని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా అధికారులు నోటీస్ కూడా విడుదల చేశారు. కాగా, మరోవైపు, భారత్ లో వంట గ్యాస్ కొరత లేదని.. బుకింగ్ చేసుకున్న రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని కేంద్ర పేర్కొంది.