Reading Time: 2 minutes

హీరో మంచు మనోజ్ వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ లు ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్‌నెస్, ట్రాన్స్‌ఫర్మేషన్ గురించిన అప్డేట్‌ను షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నా రు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణ యం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవ లం కష్టం మాత్రమే”అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవ రూ నటించలేరు.

ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు”అని ఆయన అన్నారు. ఇకపై కేవలం లుక్ కోసం కాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం ధృడమైన వ్యక్తిలా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్డేట్‌ను వీక్ 3 అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు. ఇటీవల విడుదలైన చిత్రాలతో మంచు మనోజ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన మిరాయ్ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శక్తివంతమైన విలన్ పాత్ర అయిన మహాబీర్ లామా..‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మంచు మనోజ్ చేస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.