Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి జిల్లా కేంద్రానికి రింగురోడ్డు ఏర్పాటుతో పాటు వాటిని జా తీయ రహదారులకు అనుసంధానించే అంశాల పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి పూర్తిస్థా యి ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్డు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆ శాఖ ప్ర త్యేక కార్యదర్శి వికాస్‌రాజ్, సిఎంఒ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అ నుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధిం చి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హై దరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా ని ర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగాలని సిఎం సూచించారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిం దిగా ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన ఏరియాలలో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిం చారు. స మస్యలు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ వి భాగాలతో సమీక్షించి స్పష్టమైన విధానంతో ముం దుకు వెళ్లాలన్నారు. బోధనా హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హాస్పిటల్స్ భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.