Reading Time: < 1 minute

సర్వోన్నత న్యాయస్థానంలో స్పీకర్‌పై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై గురువారం (12న) విచారణ జరగనున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తాము దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎనలేని జాప్యం చేస్తున్నారంటూ బిఆర్‌ఎస్ లోగడ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం కోర్టు గతంలో మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. అయినా స్పీకర్ నిర్ణ యం తీసుకోకుండా ధర్మాసనం ఆదేశాన్ని ధిక్కరించారం టూ బిఆర్‌ఎస్ ధిక్కరణ (కంటెంప్ట్) పిటిషన్ దాఖలు చే సింది. దీనిని సుప్రీం సీరియస్‌గా తీసుకుని మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని,స్పీకర్‌కు ఇదే చివరి గడువు అని గట్టిగా తెగేసి చెప్పింది. ఆ గడువు ముగిసి గురువారం సుప్రీం బెంచ్ విచారణ చేపట్టనున్నది. దీంతో గురువారం సుప్రీం ధర్మాసనం స్పీకర్ విచారణ, మొత్తం పది అనర్హత పిటిషన్లపై తీర్పు ఇచ్చేసి విచారణ ముగించడంతో సంతృప్తి చెంది తమ ముందు ఉన్న కంటెంప్ట్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తుందా? లేక స్పీకర్ ఇచ్చిన తీర్పు లోతుల్లోకి వెళ్ళి, మళ్లీ ఏదైనా ఉత్తర్వులు ఇస్తుందా? అనేది వేచి చూడాల్సిందేనని వివిధ పార్టీల నాయకులు అంటున్నారు.