Reading Time: 2 minutes

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలిగింపు కోరుతూ ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాస నం బుధవారం లోక్‌సభలో వీ గిపోయింది. చట్టసభలో అసాధారణ రీతిలో తీసుకువచ్చిన ఈ తీర్మానంపై పెద్దగా ఎటువంటి ప్రతిస్పందనలు, ఊహించిన రీతిలో వాగ్యుద్ధాల నడుమ ఓడిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాల తీరుపైసభలో మండిపడ్డారు. ప్రత్యేకించి లోక్‌సభలో విపక్ష నేత రా హుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాటలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలోనే అమిత్ షా ఘాటు ప్రసంగం సాగింది. ప్రతిపక్షాల సభ్యులు ప్రవర్తన, సభా తీరుతెన్నుల గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రతిపక్ష నేత హోదా ఉన్న వ్య క్తి వైఖరే సభలో విచిత్రరీతిలో ఉంటే, ఇక ప్రతిపక్షం గురించి చెప్పాల్సిందేముం ది? ఆయన ఉన్నట్లుండి లేచి వె ళ్లి ప్రధానిని ఆలింగనం చేసుకుంటాడు. లేదా గాలిలో ముద్దు విసురుతాడు, లేదా కన్నుకొడుతాడని, ఆయన ఏ విధంగా కవ్విస్తున్నాడనేది అందరికీ తెలిసిందే అధ్యక్షా అన్నారు. ప్రతిపక్షాల సభ్యులు అంతా లేచి అమిత్‌షాకు అడ్డుతగులుతూ నినాదాలకు దిగారు. అధికార, వి పక్ష సభ్యుల మధ్య వాదోపవాదాల మధ్యనే మూ జువాణితో రణగొణధ్వనుల మధ్య తీర్మానం రా వడం,

వీగిపోయినట్లు ప్రకటించడం జరిగిపోయింది. సభలో ప్రతిపక్షానికి 230సభ్యుల బలం ఉంది. వీరిలో 99 మంది కాంగ్రెస్ సభ్యులు. మి గిలిన వారు టిఎంసి, ఎస్‌పి, డిఎంకె ఇతర పా ర్టీ ల వారు ఉన్నారు. పాలకపక్షానికి 293 మంది ఎంపీల బలం ఉంది. వీరిలో బిజెపి బటం 240, జెడియు నుంచి 16 మంది, టిడిపి నుంచి 12 మంది, ఎన్‌డిఎ ఇతర మిత్రపక్షాల ఎంపీలు ఉన్నారు. సభలో బలాబలాలను బట్టి తీర్మానం నిలువదనేది అందరికీ తెలుసు. అయితే ప్రతిపక్షాలు తమ వాదనను తెలియచేసుకోవడానికి ఈ తీర్మానాన్ని వాడుకున్నట్లు స్పష్టం అయింది. స్పీకర్ ఓం బిర్లా అధికార పక్షం వ్యక్తిగా వ్యహరిస్తున్నాడని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదని, ప్రజాస్వామిక పార్లమెంటరీ సంప్రదాయాలకు భిన్నంగా ప్రతిపక్షాల గొంతుకను అణచివేస్తున్నారని తీర్మానం కారణాలలో పేర్కొన్నారు. తీర్మానంపై మంగళవారం నుంచి గురువారం వరకూ వాడివేడిగా చర్చ .జరిగింది. స్పీకర్‌కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానం వీగిపోయిందని నిరసనల మధ్య ప్రకటించారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య తిరోగమన చర్య

ప్రతిపక్షాల అవిశ్వాసం పై అమిత్ షా మండిపాటు

సభలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం, సరికాదని చెపితే ఆయన పదవిని కించపరుస్తూ తీర్మానం పెట్టడం ఎంతవరకూ సభబు అని హోం మంత్రి అమిత్ షా నిలదీశారు. లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం తీర్మానానికి జరిగిన చర్చపై ప్రభుత్వం తరఫున అమిత్ షా స్పందించారు. పార్లమెంటరీ విలువలు, పద్థతులకు తూట్లు పొడిచారని విమర్శించారు. స్పీకర్ సభకు తటస్థ కస్టోడియన్‌గా ఉంటారు, ప్రతిపక్షాలు, అధికార పక్షాల సభ్యులకు వారధిగా నిలుస్తారు. అటువంటి స్థానంలోని వ్యక్తిపై తొలిగింపునకు తీర్మానం తీసుకురావడం దురదృష్టకరం , పార్లమెంటరీ రాజకీయాలకు అనుచితం అని అమిత్ షా మండిపడ్డారు..

కాంగ్రెస్ నేతలకు థరూర్ క్లాస్ తీసుకోవాల్సిందే

ప్రతిపక్ష నేతలు ప్రత్యేకించి కాంగ్రెస్‌లో చలామణి అయ్యే నేతలు దారితప్పారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో మిగిలిన సీనియర్ ఎంపి శశి థరూర్ ఇతర అతి కొద్ది మంది నేతలు అయినా వారికి బుద్ధి చెప్పాల్సి ఉందని అమిత్ షా చురకలు పెట్టారు. సభలో ఏ విధంగా ఉండాలి? సభా మర్యాదలు పద్ధతులు పాటించడం ఎట్లా అనేది తెలియచేయాల్సి ఉందని హితవు పలికారు. తప్పుగా వ్యవహరించే సభ్యులను స్పీకర్ దారికి తెచ్చేందుకు మందలిస్తే తప్పేమీ లేదన్నారు. స్పీకర్ ఓం బిర్లా ఈ అవిశ్వాస తీర్మానం తనపై వచ్చినందున తాను చర్చ దశలో సభలో ఉండనని ముందుగా చెప్పారు. దీనితో సభకు ఈ దశలో బిజెపి ఎంపి జగదాంబికా పాల్ అధ్యక్షత వహించారు. అవిశ్వాస తీర్మానం ఓడిందని ప్రకటించారు. గురువారానికి సభ వాయిదా పడింది. గురువారం తిరిగి సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరుగుతుంది. ఈ దశలోనే ఆయన తమ తరఫున ఓ ప్రకటన వెలువరించనున్నారు. సభలలో ప్రతిపక్ష సభ్యులు , ప్రత్యేకించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరు తెన్నులను విశ్లేషిస్తూ మాట్లాడుతారని వెల్లడైంది.