Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మూడవ విద్యుత్ పంపిణి సంస్థ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వి ద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన మూడవ డిస్కం పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిజిఆర్‌పిడిసిఎల్)గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే దక్షిణ తె లంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిజిఎస్‌పిడిసిఎల్), ఉ త్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిజిఎన్‌పిడిసిఎల్) రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. తాజాగా మూడ వ డిస్కంగా టిజిఆర్‌పిడిసిఎల్‌ను అధికారికంగా ఏర్పా టు చేశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై,

సీవరేజ్ బోర్డు పరిధిలోని కనెక్షన్లు, ఎల్‌టి విఐబి కేటగిరీ పరిధిలోని మునిసిపల్ నీటి సరఫరా కనెక్షన్లు టిజిఆర్‌పిడిసిఎల్ పరిధిలోకి రానున్నాయి. దక్షి ణ తెలంగాణ వి ద్యుత్ పంపిణి సంస్థలో సిఎండి గా పనిచేసిన అ నుభవమున్న ము షారఫ్ ఫరూఖీను కొత్త విద్యుత్ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అలాగే రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర తెలంగాణ పంపిణి సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న వి.తిరుపతిరెడ్డి, పి.కృష్ణరెడ్డి, వి.మోహన్ రా వు, ఎన్.నరసింహులును పాలక మండలి సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కా గా, టిజిఆర్‌పిడిసిఎల్ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్, ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సేవల సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మ రింత మెరుగైన సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.