Reading Time: < 1 minute

హర్మూజ్ జలసంధి మార్గంలో భారత్‌లోని గుజరాత్ కాండ్ల రేవుకు వస్తున్న మయూరి నారీ నౌకపై రాకెట్ దాడిని భారతదేశం ఖండించింది. బుధవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి ఘాటుగా స్పందన వెలువడింది. థాయ్ జాతీయ పతాకంతో వస్తున్న నౌకపై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. ఇంతవరకూ దాడికి ఏ సంస్థా బాధ్యత వహించలేదు. అయితే ఇరాన్ సైన్యం మాటువేసి ఈ దాడికి దిగినట్లు అంతర్జాతీయ మీడియా చెపుతోంది. వాణిజ్య నౌకపై దాడి జరిపి ప్రాణాంతక చర్యకు దిగడం అమానుషం,

అనాగరికం అని ఖండించారు. ఇటువంటి చర్యలు గర్హనీయం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ నౌకపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. ఇప్పుడు జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు జాడతెలియకుండా పోయినట్లు గుర్తించారు. వీరికోసం అన్వేషిస్తున్నారు. ఈ నౌకలోని 20 మందికి పైగా సిబ్బందిని , నౌక మంటల్లో చిక్కినా క్షేమంగా బయటకు తరలించినట్లు ఒమన్ నౌకాదళం తెలిపింది. అరబ్ ఏమిరేట్స్‌లోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్ తీరానికి బయలుదేరినప్పుడు దాడికి గురైంది.