Reading Time: < 1 minute

ఆద్యంతం భద్రతా ఏర్పాట్లతో నిఘాతో ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద గురువారం ఉదయం తీవ్రకలకలం చెలరేగింది. వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలోని భద్రతా వలయాల కారిడార్లను వేగంగా ఢీకొంటూ ఓ వాహనం దూసుకువచ్చింది. ఎప్పుడూ ప్రజలు, సిబ్బందితో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ఘటన కలవరానికి దారితీసింది. ప్రస్తుత యుద్ధ వాతావరణం దశలో అమెరికాలో మరింత సంచలనం అయింది. ఈ ఘటన వెంటనే డౌన్‌టౌన్‌లో రహదారులను మూసివేయించారు. జనం కదలికలను నియంత్రించారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికార వర్గాలు పూర్తి స్థాయిలో సమగ్ర ప్రకటన వెలువరించాల్సి ఉంది.