Reading Time: < 1 minute

ఖమ్మం వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చేసిన చోటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవా రం సాయంత్రం విరమించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వెలుగుమట్ల బాధితులకు ఇండ్లు కూల్చేసిన చోటునే కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మంలో మహాధర్నా చేపట్టిన కవిత, విశార దన్, బాధితులు అదే రోజు రాత్రి నిర్వాసితులతో కలిసి అంబేద్కర్ భవన్ లో నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం విదితమే.

మంగళవారం ఉదయం కవిత, విశారదన్ సహా ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేశారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత, డీఎస్‌పీ ఆఫీస్‌లో విశారదన్ దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం ఆక్రమణదారులు అంటూ వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారినే బుధవా రం ఆ స్థలాలకు యజమానులుగా పేర్కొం టు టోకెన్లు జారీ చేయడంతో దీక్ష విరమించినట్లు ప్రకటించారు. వెలుగుమట్లలో మిగతా బాధితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కవిత, విశారదన్ ప్రకటించారు.

బాధితులపై కేసులు ఎత్తేయాలి

కానీ బాధితులకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలపై కేసులు పెట్టారని కవిత అన్నారు. తనపై, విశారదన్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయకపోయి నా పర్వాలేదు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. తమ దీక్ష సందర్భంగా ఎన్నో ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.