
టెహ్రాన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడినట్టు వార్తలు వచ్చాయి. వీటిని ఇరాన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగా, సురక్షితంగానే ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ వెల్లడించారు. మొజ్తాబా గాయపడినట్టు వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, ఆయన సన్నిహితుల నుంచి ఆరా తీయగా ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వారు చెప్పారని యూసఫ్ పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టిన తొలి రోజులోనే మొజ్తాబా తన భార్య, తండ్రి ఖమేనీతో సహా పలువురు కుటుంబ సభ్యులను కోల్పోయారు.
ఈ దాడుల్లో ఆయన కూడా గాయపడినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. పశ్చిమాసియాలో భీకరంగా పోరు సాగుతున్నా ఆయనకు కనిపించకపోవడం , ప్రజలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. సుప్రీం నేతగా ఇటీవల ఆయన ఎన్నికైనా ఆయన కార్యాలయం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో తలెత్తిన సందేహాలన్నీ తాజాగా ఇరాన్ అధ్యక్షుడి కుమారుడి ప్రకటనతో దూరమయ్యాయి.