Reading Time: < 1 minute

 ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల దండకారణ్యం నుంచి 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర డిజిపి అరుణ్ దేవ్ గౌతమ్ వెల్లడించారు. బుధవారం ఆయన బస్తర్ డివిజన్ కేంద్రమైన జగదల్పూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సంయుక్తంగా రాష్ట్రంలో దండకారణ్యం ప్రాంతాలలో శాంతిని నెలకొల్పాలనే దిశగా మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలించడానికి పునరావాస పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హింస మార్గాన్ని వీడి రాష్ట్రంలోని వివిధ దండకారణ్య జిల్లాల నుండి బుధవారం 108 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన వెల్లడించారు.లొంగిపోయిన వారిలో 5 గురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు జోనల్ స్థాయి పి ఎల్ జి ఏ కంపెనీ చీఫ్ లు, 15 మంది ప్లాటు పార్టీ కమిటీ సభ్యులు, 21 మంది ఏరియా కమిటీ సభ్యులు,63 మంది పార్టీ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు.

లొంగిపోయిన 108 మంది మావోయిస్టులపై 3 కోట్ల 29 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలిపారు.వీరి వద్దనుండి ఏకే పార్టీ 47 రైఫిల్స్ 6, ఏకే 47 తార్ 1,10 ఇన్సాస్ రైఫిల్స్, కార్బన్ 1, ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్ 5,7.62 ఎం ఎం ఎల్ ఎం జి 1,5.56 ఎం ఎం ఎల్ ఎం జి 1,303 ఎం ఎం ఎల్ ఎం జి 1,303 రైఫిల్స్ 20, 12 బోర్ రైఫిల్స్ 25, బీజీఎల్ లాంచర్లు 11, 51 ఎంఎం మోర్టర్ 1, 315 బోర్ రైపిల్స్ 3, మజిల్ లోడింగ్ రైఫిల్, బర్మర్ 13, మెగా బిజిఎల్ 1 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి అందే అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రంలో గత 26 నెలల్లో 2714 మంది మావోయిస్టు లొంగిపోయినట్లు,వీరిలో ముఖ్య నేతలు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, పార్టీ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ వివేకానంద్, బిఎస్‌ఎఫ్ అదనపు డిజిపి శివాంగ్ నాంగ్యాల్, బస్తర్ రేంజ్ డీఐజీ పి సుందర్ రాజ్, సిఆర్పిఎఫ్ ఐజి షాలిన్, చత్తీస్ ఘడ్ సాయుధ దళాల ఐజి బిఎస్ ధ్రువ, బస్తర్ డివిజన్ లోని ఏడు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.