
వియన్నా: ప్రస్తుత గల్ఫ్ యుద్ధ చమురు సంక్షోభ దశలో అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వియన్నాలోని ఐఇఎ కీలక తక్షణ సమావేశంలో ప్రపంచ మార్కెట్‌కు తక్షణమే 400 మిలియన్ బ్యారెల్స్ చమురును తరలించాలని సంకల్పించారు. ఈ నిర్ణయానికి మొత్తం 32 దేశాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇరాన్‌తో అమెరికా ఇజ్రాయెల్ దళాల తీవ్రపోరు, గల్ఫ్ దేశాలలో దాడుల ఉధృతి, హర్మూజ్ జలసంధి మూసివేత క్రమంలో పలు దేశాల్లో తీవ్రస్థాయి చమురు ఇంధన సమస్య తలెత్తింది. ఈ సమస్య పరిష్కారానికి క్రమపద్ధతిలో అన్ని సభ్యదేశాలకు కోటాల మేరకు ఆయిల్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.