Reading Time: < 1 minute

ప్రముఖ నటుడు జగపతి బాబు బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ’వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బుధవారం మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ “అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా భోపాల్‌లో చేశాం. భరద్వాజ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కార్తిక్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. తన నుంచే వదలా అనే టైటిల్ కూడా వచ్చింది.

లయ ‘వదలా’లో అద్భుతంగా నటించింది. ఆముద పాత్రలో హ్రితిక కూడా చాలా చక్కగా నటించింది”అని అన్నారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ “డైరెక్టర్ వంశీ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ నేనెప్పుడూ కూడా వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు”అని తెలిపారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “జగపతి బాబుకి ఈ కథ చాలా నచ్చింది. కథ పై నమ్మకంతో ఈ సినిమా మొదలుపెట్టాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హృతికా శ్రీనివాస్, కిషోర్ నాయుడు, చోటా కె నాయుడు, కార్తీక్ పాల్గొన్నారు.