
తమ్ముడు పిచ్చి మాటలు మాట్లాడవద్దని టిడిపి ఎంపి శ్రీకృష్ణదేవరాయపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణపై ఎంని శ్రీకృష్ణదేవరాయ చేసిన కామెంట్‌పై కెటిఆర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయిపోయిందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని కెటిఆర్ గుర్తు చేశారు. నువ్వు మా తమ్ముడివి, యువకుడివి, వేరేవాళ్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన ఖర్మ మాకు లేదని, ఎపి, తెలంగాణ బాగుండాలని మేం కోరుకుంటున్నామని, ఎపి అభివృద్ధిపై, చంద్రబాబు చేస్తున్న మంచి పనులపై మాట్లాడాలని, తెలంగాణపై ఏడుపులు బంద్ చేయాలని మాజీ మంత్రి కెటిఆర్ టిడిపి ఎంపి శ్రీకృష్ణదేవరాయలను హెచ్చరించారు.