Reading Time: < 1 minute

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రం ‘జైలర్- 2’. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. 2023లో విడుదలైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపుదిద్దు కుంటోంది. ఈ సినిమాలో షారుఖ్ ప్రత్యేక పాత్రలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. ఈనెల చివరి వారంలో సెట్స్‌లోకి షారుఖ్ వస్తాడనీ, ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించనున్న సన్నివేశాలతో షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు కథను మలుపు తిప్పే అతిథి పాత్రల్లో నటించారు.